విజయవాడ పరిధిలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరల తగ్గింపు
- మళ్లీ రూ. 10 చేసిన దక్షిణ మధ్య రైల్వే
- సెప్టెంబరు 30 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి
- కరోనా కారణంగా పెంచిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలు
- తగ్గిస్తున్నట్లు ప్రకటించిన రైల్వేశాఖ
ప్లాట్‌ఫాం ధరల సమస్యను సాధ్యమైనంత వరకూ తగ్గిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులు, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రైళ్లు ఎక్కే సమయంలో సహాయంగా ఉండే వారికి ఈ తగ్గింపు బాగా ఉపయోగపడుతుందని వెల్లడించింది. అయితే కరోనా మహమ్మారితో పోరులో రైల్వేశాఖ చేపడుతున్న జాగ్రత్తలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.