Andhra Pradesh: గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ కులంపై పిటిషన్.. నోటీసులిచ్చిన హైకోర్టు

Woman Files Petition On Guntur ZP Chairperson Cast
  • ఎస్సీ కాదంటూ పిటిషన్ వేసిన తెనాలి మహిళ
  • కలెక్టర్ కూ ఫిర్యాదు చేశామని వెల్లడి
  • తప్పుడు సర్టిఫికెట్ సమర్పించారని ఆరోపణ
గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా కులంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆమె ఎస్సీ కాదని పేర్కొంటూ తెనాలికి చెందిన సరళ కుమారి అనే మహిళ పిటిషన్ ను వేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రంతో క్రిస్టినా జడ్పీ చైర్ పర్సన్ అయ్యారని ఆరోపించారు. దీనిపై ఇంతకుముందే కలెక్టర్ కూ ఫిర్యాదు చేశానని వివరించారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
Andhra Pradesh
Guntur District
ZP Chairperson
Christina
AP High Court
High Court

More Telugu News