ఏపీ మాజీ స్పీకర్ కోడెల పేరుతో నిర్మించిన ఆర్చి ధ్వంసం.. గుంటూరు జిల్లాలో ఘటన

27-09-2021 Mon 08:36
  • మర్రిచెట్టుపాలెంలో 2015లో నిర్మాణం
  • 2015లో సొంత ఖర్చుతో నిర్మించిన రుద్ర పెదవేమయ్య
  • ధ్వంసం చేసి రోడ్డుకు అడ్డంగా పడేసిన దుండగులు
Arch built in the name of former AP Speaker Kodela demolished in Guntur district

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు పేరుతో నిర్మించిన ఆర్చీని గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద కోడెల పేరుతో బెహరావారిపాలేనికి చెందిన రుద్ర పెదవేమయ్య 2015లో సొంత ఖర్చుతో ఓ ముఖ ద్వారాన్ని నిర్మించారు. అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దానిని ధ్వంసం చేసిన దుండగులు రోడ్డుకు అడ్డంగా పడేశారు. రుద్ర పెదవేమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.