కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకిన గులాబ్ తుపాను

26-09-2021 Sun 22:33
  • బంగాళాఖాతంలో గులాబ్ తుపాను
  • శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతాల్లో పెనుగాలులు
  • భారీ వర్షాలతో అస్తవ్యస్తం
  • ఇద్దరు మత్స్యకారుల మృతి
Gulab cyclone makes landfall

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు, గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలుల వేగం గంటకు 95 కిమీ వరకు పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఇద్దరు మత్స్యకారులు తుపాను గాలుల్లో చిక్కుకుని మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తీర ప్రాంత ప్రజలను అక్కడికి తరలించారు.

అటు, విజయనగరం జిల్లాపైనా గులాబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. విజయనగరం జిల్లాలో 31.7 మిమీ సగటు వర్షపాతం నమోదైంది.