కృష్ణా జిల్లాలో నిన్న అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ చిన్నారి ల‌భ్యం

26-09-2021 Sun 12:17
  • కృష్ణా జిల్లాలోని మ‌చిలీప‌ట్నం ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రిలో ఘ‌ట‌న‌
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన కుటుంబ స‌భ్యులు
  • చిన్నారిని ఓ మ‌హిళ ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తింపు
  • చిన్నారి క్షేమమేన‌ని ప్ర‌క‌ట‌న‌
police chase case infant kidnap case

కృష్ణా జిల్లాలోని మ‌చిలీప‌ట్నం ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రిలో నిన్న ఓ చిన్నారి అప‌హ‌ర‌ణ‌కు గురైంది. త‌మ చిన్నారి క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో పోలీసులు కుటుంబ స‌భ్యులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు చ‌ర్య‌లు కొన‌సాగించారు.

ఆ చిన్నారిని ఆసుప‌త్రి నుంచి ఓ మ‌హిళ ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తించారు. నిందితురాలు బంటుమిల్లి మండ‌లం సుంక‌ర‌పాలేనికి చెందిన మ‌హిళగా తేల్చారు. దీంతో ఎట్ట‌కేల‌కు చిన్నారి ఆచూకీని గుర్తించారు. ఆ శిశువు క్షేమంగా ఉంద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామ‌ని ఆమెను ప్ర‌శ్నిస్తున్నామ‌ని తెలిపారు.