Sonu Sood: సోనూసూద్ చదవాల్సిన మెయిల్స్ 52వేలు!

Sonu Sood shares screenshot of over 52000 emails in his inbox
  • స్క్రీన్‌షాట్ షేర్ చేసిన రియల్ హీరో
  • ఇంతకన్నా జీవితానికి ఇంకేం కావాలంటూ ట్వీట్
  • ఇటీవల సోను ఆస్తులపై ఐటీ రెయిడ్స్
కరోనా సమయంలో ఎంతోమంది పేదవారికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ తాజాగా ఒక ఫొటో షేర్ చేశారు. తన మెయిల్‌లో ఉన్న ఈమెయిల్స్ సంఖ్యను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సోను మెయిల్‌లో ఏకంగా 52 వేల పైగా ఈమెయిల్స్ ఉన్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది.

ఈ ఫొటోతోపాటు ‘ఆశ, నమ్మకం, ప్రార్థనలు.. ఈ జీవితానికి ఇంకేం కావాలి’ అని పోస్టు ట్వీట్ చేశాడు. కరోనా సమయంలో వలస కార్మికుల కోసం ప్రత్యేక విమానాలు, బస్సులు ఏర్పాటు చేసిన సోనూసూద్ ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులపై ఇన్‌కంట్యాక్స్ రెయిడ్స్ జరిగాయి.

సోనూసూద్ ఇప్పటి వరకూ రూ. 20 కోట్ల పన్నులు ఎగవేశాడని అధికారులు ఆరోపించారు. అలాగే విదేశాల నుంచి సేకరించిన రూ. 18 కోట్లకుపైగా విరాళాల్లో కేవలం రూ. 1.9 కోట్లు మాత్రమే ఉపయోగించాడని ఐటీ శాఖ తెలిపింది.

ఇదే విషయాన్ని పరోక్షంగా తన ట్వీట్‌లో ప్రస్తావించిన సోనూసూద్.. ‘‘నేను చూడాల్సిన మెయిల్స్ 54 వేలకుపైగా ఉన్నాయి. 18 కోట్లు ఖర్చు చేయడానికి 18 గంటలు కూడా పట్టదు’’ అంటూ పోస్టు చేశాడు.
Sonu Sood
Twitter
Viral News

More Telugu News