రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తర్వులు జారీ

26-09-2021 Sun 07:43
  • ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆదిత్యానాథ్ దాస్
  • కేబినెట్ హోదా కల్పిస్తూ ముఖ్య సలహదారుగా నియామకం
  • ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి విధులు
AP Govt Appoints IAS Adityanath Das as Chief Advisor
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిత్యనాథ్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపడతారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ హోదా లభించనుంది. ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఆయన విధులు నిర్వర్తిస్తారని సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) రేవు ముత్యాలరాజు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.