ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి

26-09-2021 Sun 06:54
  • రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ పడిపోతోంది
  • సజ్జలకు మతి భ్రమించింది
  • ఆయనను వెంటనే సైకియాట్రిస్ట్‌కు చూపించాలి
TDP Will win if elections held today said NB Sudhakar reddy
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలను చూసి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీకి 70 శాతం ఓట్లు పెరిగాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయనకు మతి భ్రమించడం వల్లే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.

సజ్జలను వెంటనే క్లినికల్ సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించాలని సూచించారు. సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స పొందితే సజ్జల మళ్లీ మామూలు మనిషవుతారని సుధాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.