పంజాబ్ 20 ఓవర్లలో 125-7... సన్ రైజర్స్ ముందు స్వల్ప లక్ష్యం

25-09-2021 Sat 21:30
  • ఐపీఎల్ లో పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
  • రాణించిన హైదరాబాద్ బౌలర్లు
  • హోల్డర్ కు 3 వికెట్లు
Simple target for Sunrisers Hyderabad

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పంజాబ్ జట్టును 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులకు పరిమితం చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 3 వికెట్లు తీయగా, సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ తలో వికెట్ సాధించారు.

పంజాబ్ కింగ్స్ జట్టులో అయిడెన్ మార్ క్రమ్ చేసిన 27 పరుగులే అత్యధికం. కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 పరుగులు చేయగా, హర్ ప్రీత్ బ్రార్ 18 నాటౌట్, క్రిస్ గేల్ 14 పరుగులు నమోదు చేశారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5), నికోలాస్ పూరన్ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.