మాచర్ల మండలం కంభంపాడులో పూడ్చిన మృతదేహం వెలికితీత

25-09-2021 Sat 20:53
  • జూన్ 24న మృతి చెందిన శశిధర్
  • సాధారణ మరణంగా భావించిన కుటుంబసభ్యులు
  • వేరే కేసులో మహిళ సమాచారంతో అసలు విషయం వెల్లడి
  • శశిధర్ పై సైనేడ్ ప్రయోగించామన్న మహిళ
Death turned into murder in Kambhampadu

గుంటూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. మాచర్ల మండలం కంభంపాడులో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీశారు. కంభంపాడుకు చెందిన శశిధర్ జూన్ 24న మృతి చెందాడు. సాధారణ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు అతడిని ఖననం చేశారు. అయితే, వేరే కేసులో ఓ నిందితురాలు ఇచ్చిన సమాచారంతో శశిధర్ ది హత్య అని వెల్లడైంది. శశిధర్ పై సైనేడ్ విషప్రయోగం చేసి చంపినట్టు ఆ మహిళ పోలీసులకు తెలిపింది.

దాంతో పోలీసులు శశిధర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం చేపట్టారు. శశిధర్ పై విషప్రయోగం జరిగినట్టు శవపరీక్షలో వెల్లడైంది.