శాంతించిన ఇసుక తుపాను... టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

24-09-2021 Fri 19:51
  • ఐపీఎల్ లో నేడు చెన్నై వర్సెస్ బెంగళూరు
  • షార్జా వేదికగా మ్యాచ్
  • షార్జాపై ఇసుక తుపాను పంజా
  • మ్యాచ్ ప్రారంభం ఆలస్యం
Chennai won the toss against RCB
షార్జా నగరంపై విరుచుకుపడిన ఇసుక తుపాను శాంతించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ కు టాస్ వేశారు. ఈ టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇది చిన్న గ్రౌండ్ అని, లక్ష్యఛేదన సమయంలో బౌలింగ్ చేయడం కొంచెం కష్టమేనని చెన్నై కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు.

అటు, బెంగళూరు సారథి కోహ్లీ స్పందిస్తూ, తాము టాస్ గెలిచినా మొదట బౌలింగే ఎంచుకునేవాళ్లమని అన్నాడు. ఇక సచిన్ బేబీ స్థానంలో నవదీప్ సైనీని తుదిజట్టులోకి తీసుకున్నామని కోహ్లీ వెల్లడించాడు. ఆల్ రౌండర్ కౌల్ జేమీసన్ స్థానంలో టిమ్ డేవిడ్ ఆడతాడని తెలిపాడు. టిమ్ డేవిడ్ కు ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఇదే తొలి మ్యాచ్ అని తెలిపాడు.