Andhra Pradesh: బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

  • తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
  • ఈ రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం
  • కోస్తాంధ్రలో మూడ్రోజుల పాటు వర్షాలు
  • ఆదివారం కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు
  • మత్స్యకారులకు హెచ్చరిక
Rain forecast for Andhra coastal region

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. తీవ్ర అల్పపీడనం ఈ రాత్రికి వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించిందని కన్నబాబు తెలిపారు. రాగల 48 గంటల్లో ఆ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనిస్తుందని వివరించారు.

దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మూడ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఆదివారం నాడు అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. అదే సమయంలో వాయవ్య-పశ్చిమ బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉండడం వల్ల మత్స్యకారులు సోమవారం వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

More Telugu News