యువరైతు రాజేశ్ ఆత్మహత్య అంశంలో కేసీఆరే నేరగాడు: రేవంత్ రెడ్డి
- మంచిర్యాల జిల్లాలో రైతు బలవన్మరణం
- కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునక
- పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడన్న రేవంత్
- ఇకనైనా స్పందించాలని హితవు
పొలాల్లో పారాల్సిన నీరు పేదల కన్నీటి రూపంలో జాలువారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వాల్సిన పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడని పరోక్షంగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రాజేశ్ ఆత్మహత్య కేసులో కేసీఆరే నేరగాడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుల అంశంపై సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి, మరో రైతు ఊపిరి పోకుండా చూస్తారా? అంటూ ట్వీట్ చేశారు.