ముంబయిని ఓ మోస్తరు స్కోరుకు కట్టడి చేసిన కోల్ కతా బౌలర్లు

23-09-2021 Thu 21:58
  • ఐపీఎల్ లో ముంబయి వర్సెస్ కోల్ కతా
  • మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 రన్స్
  • డికాక్ 55, రోహిత్ 33 పరుగులు
  • ఫెర్గుసన్, ప్రసిద్ధ్ లకు రెండేసి వికెట్లు
Kolkata bowlers restricts Mumbai Indians

కోల్ కతా నైట్ రైడర్స్ తో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. తొలి వికెట్ కు రోహిత్ శర్మ (33), క్వింటన్ డికాక్ (55) జోడీ 9.2 ఓవర్లలో 78 పరుగులు జోడించి శుభారంభం అందించినా, కోల్ కతా బౌలర్లు సమయోచితంగా విజృంభించారు. ముంబయిని భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు.

సూర్యకుమార్ యాదవ్ 5, ఇషాన్ కిషన్ 14, పొలార్డ్ 21, కృనాల్ పాండ్య 12 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో ఫెర్గుసన్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. సునీల్ నరైన్ కు ఓ వికెట్ లభించింది.

ఇక, లక్ష్యఛేదనలో కోల్ కతా ఓపెనర్లు దూకుడు ప్రదర్శించారు. 3 ఓవర్ల అనంతరం కోల్ కతా స్కోరు 1 వికెట్ నష్టానికి 40  పరుగులు. బుమ్రా బౌలింగ్ లో గిల్ (13) అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వెంకటేశ్ అయ్యర్ (27), రాహుల్ త్రిపాఠీ ఆడుతున్నారు.