ఒక్క ఛాన్స్ అంటే ఏమిటో జనాలకు ఇప్పుడు అర్థమవుతోంది: బీజేపీ నేత లంకా దినకర్

23-09-2021 Thu 15:40
  • మద్యం షాపుల్లో దోపిడీ చేస్తున్నారు
  • రోడ్లు తవ్వి కంకరను ఎత్తుకెళ్లారు
  • దోపిడీ పాలనతో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయింది
Lanka Dinakar fires on Jagan

వైసీపీ పాలనలో దోపిడీ యథేచ్చగా సాగుతోందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సచివాలయంలో ఫేక్ పత్రాలతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వేసిన రోడ్లను తవ్వి కంకరను దోపిడీ చేశారని దుయ్యబట్టారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఫేక్ చలానాలతో దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. దోపిడీ పాలనతో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో దోపిడీకి లైసెన్స్ వచ్చేసిందని జగన్ అనుకుంటున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వడం అంటే ఏమిటో ఇప్పుడు జనాలకు బాగా అర్థమవుతోందని అన్నారు.