ఆరుబయట పడుకున్న మహిళకు గొంతులో నొప్పి.. ఆసుపత్రికి వెళితే డాక్టర్లే షాక్!

she complained of throat pain and when doctors checked what they saw is shocking
షార్ట్స్‌లో చూడండి
పల్లెటూర్లలో చాలా మంది ఆరుబయటే పడుకుంటారు. ఆ గ్రామంలో కూడా అలాగే పడుకుంటారు. ఇటీవల అలా ఆరుబయట నిద్రపోతున్న ఒక మహిళకు విపరీతంగా గొంతు నొప్పి వచ్చింది. దీంతో ఆ బాధకు మేలుకున్న ఆమె తనకు గొంతు నొప్పిగా ఉందని చెప్పింది. కంఠంలో ఏదో కలియ తిప్పేస్తున్నట్లు బాధగా ఉందని మెలికలు తిరిగింది. ఆమె బాధను చూసిన కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు ముందుగా ఆ మహిళకు మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత అసలు ఆమె గొంతులో ఎందుకు నొప్పిగా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడే వారి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. ఆమె కంఠంలో నాలుగడుగుల పాము దూరింది. అందుకే ఆమె అంత ఇబ్బంది పడుతోంది. చాలా జాగ్రత్తగా ఆ పామును బయటకు తీసిన వైద్యులు దాన్ని చూసి వణికిపోయారు. బాధితురాలి కుటుంబ సభ్యులకైతే నోటమాటలేదు.

ఈ ఘటన రష్యాలోని దగస్థాన్ ప్రాంతంలో వెలుగు చూసింది. లెవాషి అనే గ్రామానికి చెందిన యువతికి ఈ ఘోరమైన అనుభవం ఎదురైంది. ఇక్కడ మరో వింత ఏంటంటే.. ఈ గ్రామం నుంచి గతంలో కూడా ఇలాంటి కేసులు కొన్ని వచ్చాయట!. ఆరుబయట నిద్రించడం వల్లే ఇలా పాములు వారి నోళ్లలోకి వెళుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
Go Back to Shorts
Russia
Snake
Throat
Doctors
Viral News

More Telugu News