‘గాడ్​ ఫాదర్​’గా రంగంలోకి దిగేసిన చిరూ

22-09-2021 Wed 15:08
  • ఊటీలో షూటింగ్ షురూ
  • మెగాస్టార్ 153వ సినిమా
  • మోహన్ రాజా డైరెక్షన్ లో చిత్రం
God Father Shoot Starts In Ooty
శత్రువుల భరతం పట్టేందుకు ‘గాడ్ ఫాదర్’ రంగంలోకి దిగేశాడు. ఇవాళ తన 153వ సినిమా షూటింగ్ ను మొదలెట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఊటీలో తొలి విడత షూటింగ్ ను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది.


కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ సహ నిర్మాణ బాధ్యతలను చూస్తోంది. తమన్ స్వరాలను అందించనున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, మెగాస్టార్ సినిమా ప్రస్థానం మొదలైన సెప్టెంబర్ 22నే గాడ్ ఫాదర్  షూటింగ్ ను మొదలుపెట్టడం విశేషం.