Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో స్కామ్ జరిగింది: ఏసీబీ

  • రూ. 117 కోట్లు పక్కదారి పట్టినట్టు ఏసీబీ గుర్తింపు
  • పలువురిపై ఇప్పటికే కేసుల నమోదు
  • సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తింపు
ACB finds scam in AP CMRF check distribution

ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీలో కుంభకోణం జరిగిందని ఏసీబీ తేల్చింది. ఈ స్కామ్ లో సచివాలయంలోని కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. చెక్కుల పంపిణీలో రూ. 117 కోట్లను పక్కదారి పట్టించేందుకు యత్నించారని గతంలోనే ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి గత సెప్టెంబర్ లోనే కేసు నమోదైంది.

ఈ స్కామ్ లో ప్రజాప్రతినిధుల పీఏలు, వారి అనుచరుల ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో దాదాపు 50 మంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు. అంతేకాదు ఏపీ సచివాలయంలో కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తించింది.

More Telugu News