తొలిసారి కలిసి నటించనున్న బాబాయ్, అబ్బాయ్!

22-09-2021 Wed 14:49
  • వెంకీ, రానా కాంబోలో ‘రానానాయుడు’
  • నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్
  • అమెరికన్ క్రైమ్ డ్రామాకు రీమేక్
Venky And Rana Will Be Appearing Together In Netflix Series
తొలిసారి బాబాయ్, అబ్బాయ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. కలిసి నటించబోతున్నారు. బాబాయ్, అబ్బాయ్ అంటే.. ఇక్కడ విక్టరీ వెంకటేశ్, రానాలు. ఇద్దరూ కలిసి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కనిపించనున్నారు.

‘రానానాయుడు’ పేరిట ఆ వెబ్ సిరీస్ ను ఐఎన్ సీ లోకోమోటివ్, నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ లు కలిసి నిర్మించనున్నాయి. అమెరికాలో సూపర్ హిట్ అయిన క్రైమ్ డ్రామా ‘రే డొనవాన్’కు రీమేక్ గా ఈ ‘రానానాయుడు’ రూపొందుతోంది. మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్, బంగీస్థాన్, డాగ్ విస్పరర్ వంటి హిట్ సిరీస్ లకు దర్శకత్వం, స్క్రీన్ ప్లేకు పనిచేసిన కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మలు.. ‘రానానాయుడు’కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.