సూడాన్‌లో సైనిక తిరుగుబాటు విఫలం.. తిప్పికొట్టిన ప్రభుత్వ దళాలు
- తిరుగుబాటుదారులను అరెస్ట్ చేశామన్న ప్రభుత్వ వర్గాలు
- దేశంపై నియంత్రణ ప్రస్తుత అధికార మండలిదేనని స్పష్టీకరణ
- ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం
తాజాగా, మరో ఆఫ్రికన్ కంట్రీ సూడాన్‌లోనూ సైన్యం తిరుగుబాటుకు యత్నించగా ప్రభుత్వ అనుకూల దళాలు తిప్పికొట్టాయి. స్వల్ప సంఖ్యలోనే ఉన్న తిరుగుబాటుదారులను అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంపై నియంత్రణ ప్రస్తుత అధికార మండలి కలిగి ఉందని పేర్కొన్నాయి. తిరుగుబాటు నేపథ్యంలో సైనిక ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండేళ్ల క్రితం నియంత ఒమర్ అల్ బషీర్‌కు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడి మూడు దశాబ్దాల పాలనకు చరమగీతం పాడిన సంగతి తెలిసిందే.