తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసుల వెల్లడి
- గత 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,938 మందికి చికిత్స
అదే సమయంలో 296 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,906 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,061 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,938 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,907కి పెరిగింది.
