రేపు 'రిపబ్లిక్' ట్రైలర్ రిలీజ్ చేయనున్న చిరంజీవి!

21-09-2021 Tue 17:03
  • కలెక్టర్ పాత్రలో సాయితేజ్
  • రాజకీయనాయకురాలిగా రమ్యకృష్ణ
  • రేపు ఉదయం 10 గంటలకు ట్రైలర్ రిలీజ్
  • అక్టోబర్ 1వ తేదీన సినిమా విడుదల
Republc movie update

సాయితేజ్ కథానాయకుడిగా దర్శకుడు దేవ కట్టా 'రిపబ్లిక్' సినిమాను రూపొందించాడు. అవినీతిపరులైన రాజకీయనాయకులను ఎదిరించే నిజాయతీ పరుడైన ఒక కలెక్టర్ కథ ఇది. ఆ కలెక్టర్ పాత్రలో సాయితేజ్ నటించగా, రాజకీయ నాయకురాలుగా రమ్యకృష్ణ కనిపించనుంది.

భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

రేపు ఉదయం 10 గంటలకు చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సాయితేజ్ హాస్పిటల్లో ఉన్న కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాను ముందుగా చెప్పినట్టుగా అక్టోబర్ 1వ తేదీనే విడుదల చేయనున్నారు.