దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్

21-09-2021 Tue 09:56
  • కొత్త‌గా 26,115 క‌రోనా కేసులు
  • కేసుల మొత్తం సంఖ్య‌ 3,35,04,534
  • మ‌రో 252 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,45,385
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్తగా 26,115 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,35,04,534కి చేరింది. అలాగే, నిన్న 34,469 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 252 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,385కి పెరిగింది.  

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,27,49,574 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,09,575 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 96,46,778 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 81,85,13,827 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.