తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

20-09-2021 Mon 21:03
  • గత 24 గంటల్లో 45,274 కరోనా పరీక్షలు
  • 208 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 49 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,991 మందికి చికిత్స
Telangana corona bulletin

తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 45,274 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 49 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, ఖమ్మం జిల్లాలో 12, మంచిర్యాల జిల్లాలో 11 కేసులు వెలుగు చూశాయి.

వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,662 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,54,765 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,991 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,906కి పెరిగింది.