మంద కృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు

20-09-2021 Mon 18:13
  • ఢిల్లీలోని హోటల్లో ప్రమాదానికి గురైన మంద కృష్ణ
  • హైదరాబాదులోని ఇంట్లో బెడ్ రెస్టులో ఉన్న వైనం
  • ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు
Chandrababu went to Manda Krishna Madiga

ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాదులోని మంద కృష్ణ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. మంద కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్ట్ హోటల్లో ఇటీవల మంద కృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాలు జారి పడటంతో ఆయన కుడికాలి ఎముక విరిగింది. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. ఢిల్లీ అపోలోలో శస్త్ర చికిత్స నిర్వహించిన తర్వాత ఆయన హైదరాబాదులోని ఇంటికి వచ్చారు. హైదరాబాదుకు వచ్చినప్పటి నుంచి ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నారు. మంద కృష్ణను పరామర్శించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ ఉన్నారు.