Chandrababu: ఏపీ ఇప్పుడు డ్రగ్స్ కు కూడా కేంద్రంగా మారింది: చంద్రబాబు

  • గుజరాత్ లో భారీగా హెరాయిన్ పట్టివేత
  • పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.9 వేల కోట్లు
  • ఆఫ్ఘనిస్థాన్ నుంచి దిగుమతి
  • విజయవాడకు చెందిన ఓ సంస్థపై అనుమానాలు
  • తాలిబన్లతో సంబంధాలు పెట్టుకునే స్థాయికి చేరారన్న చంద్రబాబు
Chandrababu comments on heroin seizure

గుజరాత్ లోని ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడడం తెలిసిందే. ఈ హెరాయిన్ ను టాల్కం పౌడర్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి విజయవాడలోని ఓ ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

గుజరాత్ లో హెరాయిన్ పట్టుబడిన నేపథ్యంలో, ఏపీ ఇప్పుడు డ్రగ్స్ కు కూడా కేంద్రంగా మారినట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ అవినీతి, వైన్, మైన్, ల్యాండ్, శాండ్ మాఫియా అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని విమర్శించారు. తాలిబన్లు, ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకునే వరకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. హెరాయిన్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను నిగ్గుతేల్చాలని, తద్వారా డ్రగ్స్ ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు.

More Telugu News