Nagarjuna: ఇది నాన్న నవరత్నాల హారం.. ఇది నవరత్నాల ఉంగరం: నాగార్జున

Nagarjuna releases video on the occasion of his father Nageswar Rao birthday
  • ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి
  • తన తండ్రిని గుర్తు చేసుకున్న నాగార్జున
  • తన తండ్రి హారం, ఉంగరం, వాచ్ ధరించి వీడియో
తెలుగు జాతి గర్వించదగిన దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి నేడు. ఈ సందర్భంగా తన తండ్రిని నాగార్జున గుర్తు చేసుకున్నారు. ఆయనపై తనకున్న అంతులేని ప్రేమను అభిమానులతో పంచుకున్నారు. బంగార్రాజులా పంచకట్టులో మెరిసిపోతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన పొందూరు ఖద్దరు పంచె, నవరత్నాల హారం, నవరత్నాల ఉంగాన్ని ధరించారు. మై హీరో... హై ఇన్స్పిరేషన్ అంటూ ఆయన తన తండ్రి గురించి ట్వీట్ చేశారు.

తన తండ్రి పుట్టినరోజైన సెప్టెంబర్ 20వ తేదీ అంటే తనకు చాలా ఇష్టమని నాగార్జున చెప్పారు. నాన్న గారికి పంచెకట్టంటే చాలా ఇష్టమని... ఆయన పంచె కట్టుకున్నప్పుడల్లా ఎంతో ముచ్చటేసేదని అన్నారు. ఆయనకు పొందూరు ఖద్దరంటే చాలా ఇష్టమని... ఇప్పుడు తాను వేసుకున్నది కూడా పొందూరు ఖద్దరేనని తెలిపారు. ఇది నవరత్నాల హారం, ఇది నవరత్నాల ఉంగరం, ఈ వాచ్ నాకన్నా సీనియర్, ఆయన ఫేవరెట్ వాచ్ అని చెప్పారు. నా ఫేవరెట్ వాచ్ కూడా ఇదేనని అన్నారు. ఇవన్నీ వేసుకుంటే నాన్న తన ముందు ఉన్నట్టుందని చెప్పారు. నాన్నగారి అందాన్ని మీ ముందుకు తీసుకురావడానికే ఈ ప్రయత్నమని అన్నారు.
Nagarjuna
Akkineni Nageswara Rao
Birthday
Tollywood

More Telugu News