Pawan Kalyan: ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan responds to AP Parishat elections
  • ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు
  • నిన్న ఓట్ల లెక్కింపు
  • పలు విజయాలు ఖాతాలో వేసుకున్న జనసేన
  • తమ అభ్యర్థులకు అభినందనలు తెలిపిన పవన్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. అధికారిక ఫలితాల ప్రకారం జనసేన అభ్యర్థులు 177 ఎంపీటీసీ స్థానాలు, 2 జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నారని పవన్ పేర్కొన్నారు. ఏప్రీల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన అభ్యర్థులు బలమైన పోరాటం చేశారని అన్నారు. పార్టీ తరఫున విజయం సాధించినవారికి జనసైనికుల తరఫున, పార్టీ నేతల తరఫున హృదయపూర్వక అభినందనలు అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో, ఏ నేపథ్యంలో జరిగాయి అనేందుకు తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పవన్ పేర్కొన్నారు. అయితే, అదనపు సమాచారం కోసం చూస్తున్నామని, ఒకట్రెండు రోజుల్లో దీనిపై సంపూర్ణ విశ్లేషణ చేపట్టి మరోసారి ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.
Pawan Kalyan
Parishat Elections
Janasena
Results
MPTC
ZPTC
Andhra Pradesh

More Telugu News