'చంద్రముఖి' సీక్వెల్ అందుకే మొదలుకాలేదట!

20-09-2021 Mon 10:30
  • సంచలన విజయాన్ని సాధించిన 'చంద్రముఖి' 
  • సీక్వెల్ కి నో చెప్పిన రజనీకాంత్ 
  • రంగంలోకి దిగిన లారెన్స్ 
  • ప్రధానమైన పాత్రలో అనుష్క
Chandramukhi Sequel Update

హారర్ కామెడీ జోనర్లో వచ్చిన సినిమాలలో 'చంద్రముఖి' ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ సినిమాలో రజనీ మరోసారి మ్యాజిక్ చేశారు. ఈ సినిమా వచ్చి ఇంతకాలమైనా, ఆ జోనర్లో మరో సినిమా దానిని దాటుకుని ముందుకు వెళ్లలేకపోయింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి రజనీ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో దర్శకుడు పి.వాసు, లారెన్స్ ను రంగంలోకి దింపారు.

ఈ సీక్వెల్ కి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందట .. అలాగే నిర్మాతలు కూడా రెడీగానే ఉన్నారు. కానీ ఇంతవరకూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. సెకండ్ వేవ్ తరువాత ఈ సినిమా షూటింగు వెళ్లకపోవడానికి కారకుడు లారెన్స్ అనే టాక్ వినిపిస్తోంది. ఆయన కావాలనే ఆలస్యం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

'చంద్రముఖి' సీక్వెల్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, ఓటీటీ ద్వారా వదలాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇది థియేటర్లలో మాత్రమే చూడవలసిన సినిమా అని భావించిన లారెన్స్, థియేటర్లన్నీ తెరుచుకున్న తరువాతనే రంగంలోకి దిగాలని భావిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర కోసం అనుష్కను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.