Raviteja: 'విక్రమార్కుడు' సీక్వెల్ లేనట్టే!

 Raviteja is not doing Vikramarkudu sequel
  • రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు'
  • రవితేజ కెరియర్లో పెద్ద హిట్ 
  • సీక్వెల్ కి సన్నాహాలు అంటూ టాక్
  • నిజం లేదనేది సన్నిహితుల మాట
రవితేజ కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన 'విక్రమార్కుడు' భారీ విజయాన్ని సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రవితేజ డ్యూయెల్ రోల్ చేశాడు. మాస్ యాక్షన్ తో పాటు కావలసినంత ఎమోషన్ కూడా ఉండటంతో, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కథను వేరే దర్శకుడికి ఇస్తున్నాడనీ, బడా బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదనేది తాజాగా వినిపిస్తున్న మాట.

రవితేజ 'కిక్' సినిమాకి సీక్వెల్ గా 'కిక్ 2' చేయగా అది పెద్దగా ఆడలేదు. అప్పటి నుంచి ఆయన సీక్వెల్ సినిమాలపై ఆసక్తిని చూపడం లేదట. అందువలన ఆయన 'విక్రమార్కుడు' సీక్వెల్ చేసే అవకాశమే లేదని అంటున్నారు. 
Raviteja
Anushka Shetty
Rajamouli

More Telugu News