విజయ్ దేవరకొండ సొంత మల్టీప్లెక్స్ ఎలా ఉందో చూశారా...?

19-09-2021 Sun 21:08
  • మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్
  • ఏవీడీ పేరిట థియేటర్ కాంప్లెక్స్
  • మల్టీప్లెక్స్ కు యజయానిని అయ్యానంటూ విజయ్ వెల్లడి
  • ఈ నెల 24న ప్రారంభం
Vijay Devarakonda says now he owned a multiplex
టాలీవుడ్ హీరోలు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు నిర్మించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే మహేశ్ బాబు, ప్రభాస్ వంటి అగ్రహీరోలు సొంత మల్టీప్లెక్స్ లు కలిగి ఉన్నారు. తాజాగా యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కూడా ఈ జాబితాలో చేరారు. తన తల్లిదండ్రుల స్వస్థలం మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఆసియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఈ థియేటర్ల సముదాయం నిర్మించారు. దీనికి ఆసియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ (ఏవీడీ) అని నామకరణం చేశారు.

దీని వివరాలను విజయ్ దేవరకొండ ఓ వీడియో రూపంలో వెల్లడించారు. సినిమా నటుడ్ని అవ్వాలన్నది తన కల అని, అక్కడ్నించి ఇవాళ తాను ఓ మల్టీప్లెక్స్ కు యజమానిని అయ్యానని తెలిపారు. ఈ మల్టీప్లెక్స్ సెప్టెంబరు 24న ప్రారంభం కానుందని, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రాన్ని తొలిగా ప్రదర్శిస్తామని విజయ్ దేవరకొండ వివరించారు.