ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ భ‌క్త‌జ‌న సందోహం... ఆర్టీసీ బ‌స్సులో వినాయ‌క నిమ‌జ్జనానికి స‌జ్జ‌నార్.. వీడియోలు ఇవిగో

19-09-2021 Sun 13:27
  • ట్యాంక్ బండ్ వ‌ద్దకు వేలాది మంది భ‌క్తులు
  • ట్యాంక్ బండ్ చేరుకున్న ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి
  • ముమ్మ‌ర ఏర్పాట్లు చేసిన పోలీసులు
ganesh nimajjan at tank bund

హైదరాబాద్ లో గ‌ణేశుడి నిమజ్జనాల నేప‌థ్యంలో ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాలకు వేలాదిగా భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా  ఆర్టీసీ బస్సులో కూర్చుని వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ప‌ట్టుకుని కుటుంబసభ్యులతో క‌లిసి నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో వైరల్ అవుతోంది.

                  
భ‌క్తులు వేలాదిగా త‌ర‌లిరావ‌డంతో ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతమంతా సంద‌డి నెల‌కొంది. అనేక ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్‌కు గ‌ణేశుడి విగ్ర‌హాలు త‌ర‌లివ‌స్తున్నాయి. గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా నినాదాల‌తో భ‌క్తులు నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి విగ్ర‌హం కూడా ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.