అందుకే మేము పరిషత్ ఎన్నికలను బహిష్కరించాం: అచ్చెన్నాయుడు
- ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేతలు ఖూనీ చేశారు
- అధికార పార్టీకి అధికారులతో పాటు పోలీసులు సహకరించారు
- ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్‌కు ఉందా? అని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్‌లో చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కరణ జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేతలు ఎలా అపహాస్యం చేశారో దేశం మొత్తం చూసిందని ఆయన చెప్పారు. మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం కోసం అక్రమ కేసులు పెట్టారని ఆయన చెప్పారు.