ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు.. బోణీ కొట్టిన వైసీపీ
- నెల్లూరు జిల్లా కొవ్వూరులో తొలి ఫలితం
- ఆమంచర్ల ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి గెలుపు
- సౌత్ మోపూరు స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి విజయం
సాయంత్రం 4 గంటలలోపు కౌంటింగ్ పూర్తి కానుంది. ఇతర ప్రాంతాల్లోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అనంతపురం జిల్లా మడకశిరలో ట్రాఫిక్ ఎస్సైగా పనిచేస్తున్న అంజాద్ అలీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. కరోనా నేపథ్యంలో ర్యాలీలు, విజయోత్సవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.