తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

19-09-2021 Sun 07:39
  • వారం రోజులుగా వర్షాలకు తెరిపి
  • తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి
  • బంగాళాఖాతంలో ఆవర్తనం
Heavy Rains predicted in telangana tomorrow and day after tomorrow
వారం రోజులుగా వర్షాలు లేక కాస్తంత తెరిపినపడిన తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది.

అలాగే, బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింది. ఇది నేడు ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు స్వల్పంగా, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.