కవితలు రాసిన ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్... ఆవిష్కరించిన సీఎం జగన్

18-09-2021 Sat 20:47
  • ఏపీ సీఎస్ సాహితీ పిపాస
  • 'డ్యాన్సింగ్ విత్ డ్రీమ్స్' పేరిట కవితా సంకలనం
  • తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరణ
  • సీఎంకు ఓ పెయింటింగ్ ను బహూకరించిన సీఎస్
CM Jagan launches poems penned by AP CS Adithyanath Das

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా త్వరలోనే పదవీ విరమణ చేయనున్న ఆదిత్యనాథ్ దాస్ లో మంచి సాహితీవేత్త కూడా ఉన్నాడు. ఆదిత్యనాథ్ దాస్ ఆంగ్లంలో కవితలు రాయగా, ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ వాటిని ఆవిష్కరించారు. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తాను రాసిన కవితలను 'డాన్సింగ్ విత్ డ్రీమ్స్' పేరిట సంకలనం చేశారు. రామ్ ప్రసాద్ అనే బుక్ పబ్లిషర్ ఈ కవితా సంకలనాన్ని ప్రచురించారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు జరిగింది. 'డ్యాన్సింగ్ విత్ డ్రీమ్స్' కవితా సంకలనాన్ని విడుదల చేసిన సీఎం జగన్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను అభినందించారు. ఈ సందర్భంగా తాను గీసిన ఓ పెయింటింగ్ ను ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్ కు బహూకరించారు.