Allu Arjun: 'ర్యాపిడో' బైక్ టాక్సీ యాడ్ చిత్రీకరణలో అల్లు అర్జున్, త్రివిక్రమ్

Allu Arjun and Trivikram Srinivas join hands for Rapido bike taxi
  • దేశంలో బైక్ టాక్సీ సంస్కృతి
  • అగ్రగామిగా ఉన్న ర్యాపిడో సంస్థ
  • దాదాపు 100 నగరాల్లో సేవలు
  • తెలుగు రాష్ట్రాల్లోనూ బైక్ టాక్సీలపై ప్రచారం
  • ప్రత్యేకంగా బన్నీతో వాణిజ్య ప్రకటన
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం
దేశంలో బైక్ టాక్సీలు విస్తృతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదనిపిస్తోంది. ఈ విషయంలో ర్యాపిడో సంస్థ అగ్రగామిగా ఉంది.  దేశంలోని 100 నగరాల్లో బైక్ ట్యాక్సీ సేవలు అందిస్తోంది. ఓ యాప్ సాయంతో ఈ సేవల నిర్వహణ సాగిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే... ర్యాపిడో బైక్ టాక్సీ యాడ్ ను తెలుగులో రూపొందిస్తున్నారు.

ఈ యాడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాలే కాకుండా పేరుమోసిన బ్రాండ్లకు వాణిజ్య ప్రకటనలు కూడా రూపొందిస్తుంటారు. ఆయన సినిమాల్లాగే ఆయన చేసే యాడ్ లు కూడా సూటిగా, ఆకట్టుకునేలా ఉంటాయి.
Allu Arjun
Trivikram Srinivas
Rapido
Bike Taxi

More Telugu News