'నాట్యం' రిలీజ్ డేట్ ఖరారు!

18-09-2021 Sat 18:02
  • 'నాట్యం' ప్రధానంగా నడిచే కథ
  • ప్రధాన పాత్రలో సంధ్యారాజు
  • దర్శకుడిగా రేవంత్ కోరుకొండ పరిచయం
  • అక్టోబర్ 22వ తేదీన విడుదల    
Natyam movie release date confirmed

'నాట్యం' ప్రధానంగా గతంలో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సారి 'నాట్యం' అనే టైటిల్ తో .. నాట్యమే ప్రధానమైన కాన్సెప్ట్ గా ఈ సినిమా రూపొందింది. కూచిపూడి కళాకారిణి సంధ్యారాజు ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు పోస్టర్ కు .. ఫస్టు సింగిల్ కు .. ఇటీవల వదిలిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. అక్టోబర్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సంధ్యారాజు ఈ సినిమాలో నటించడమే కాకుండా, ఈ సినిమా నిర్మాతగా కూడా ఆమె వ్యవహరించారు. కొరియోగఫీ .. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ఆమెనే చూసుకున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కమల్ కామరాజు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.