తొలిసారిగా తెలుగు బిగ్ బాస్ వేదికపై రామ్ చరణ్ సందడి

18-09-2021 Sat 16:14
  • హుషారుగా సాగిపోతున్న బిగ్ బాస్-5
  • వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ చరణ్, మ్యాస్ట్రో టీమ్ సభ్యులు
  • డిస్నీ ఓటీటీలో రిలీజైన మ్యాస్ట్రో చిత్రం
  • డిస్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్
Ram Charan first time appears on Bigg Boss show

తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ ఉత్సాహంగా సాగిపోతోంది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున రెండ్రోజుల పాటు సందడి చేయనున్నారు. ఈ వారాంతంలో బిగ్ బాస్ వేదికపై టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ విచ్చేయనున్నారు. మ్యాస్ట్రో టీమ్ తో కలిసి చెర్రీ హంగామాను అభిమానులు కనులారా తిలకించవచ్చు. నితిన్, తమన్నా, నభా నటేష్ నటించిన మ్యాస్ట్రో చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికపై రిలీజైంది.

ఈ చిత్రం ప్రచారంలో భాగంగా మ్యాస్ట్రో టీమ్ సభ్యులు నితిన్, తమన్నా, నభా నటేష్ లతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ కూడా బిగ్ బాస్ వేదికపై దర్శనమిచ్చారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులతోనూ రామ్ చరణ్ ఈ సందర్భంగా ముచ్చటిస్తాడని తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ 4 సీజన్లు జరిగినా, రామ్ చరణ్ ఎప్పుడూ రాలేదు. ఈసారి ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ వేదికపై రామ్ చరణ్ దర్శనమివ్వనుండడంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు.