తాప్సీకి ఫస్ట్ ప్రైజ్... చిన్నప్పటి ఫొటో పంచుకున్న అందాలభామ

18-09-2021 Sat 15:34
  • ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగులో ఎంట్రీ
  • తమిళం, హిందీలోనూ రాణిస్తున్న తాప్సీ
  • నటనలో సత్తా చాటుతున్న వైనం
  • బాల్యంలో వేగంగా పరిగెత్తేదాన్నని వెల్లడి
Actress Tapsee shares childhood pic

దక్షిణాది భాషలతో పాటు హిందీ చిత్రసీమలోనూ సత్తా చాటుతున్న అందాలతార తాప్సీ ఆసక్తికర ఫొటో పంచుకుంది. స్కూల్లో నిర్వహించిన ఓ రన్నింగ్ రేసులో తాప్సీ ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం ఆ ఫొటోలో చూడొచ్చు. చిన్నప్పుడు చాలా వేగంగా పరిగెత్తే దాన్ని అంటూ ఆ ఫొటోపై తాప్సీ వ్యాఖ్యానించింది.

ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ తమిళం, హిందీలోనూ అనేక అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా అనబెల్ సేతుపతి అనే చిత్రంలో నటించింది. హీరోయిన్ కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో తాప్సీ తన నటనా ప్రతిభను చాటుకుంటోంది. ఇక, టీమిండియా మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న శభాష్ మిథు చిత్రంలో తాప్సీ లీడ్ రోల్ పోషిస్తోంది. రష్మీ రాకెట్, జనగణమన వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది.