KTR: అవసరమైతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై దేశద్రోహం కేసులు పెడతాం: కేటీఆర్

Will file sedition cases on Revanth Reddy and Bandi Sanjay warns KTR
  • ముఖ్యమంత్రి గురించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
  • టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నా గురించి మాట్లాడుతున్నారు
  • నా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవసరమైతే వీరిద్దరిపై దేశద్రోహం కింద తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో తన గురించి మాట్లాడటం, కేసీఆర్ ను తాగుబోతుగా మాట్లాడటాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. వైద్య పరీక్షల కోసం తన బ్లడ్ శాంపిల్ ను ఇవ్వడానికి తాను సిద్ధమని ఆయన అన్నారు. రాహుల్ రక్తాన్ని వైద్య పరీక్షల కోసం తీసుకోవాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. అప్పుడు డ్రగ్స్ కు ఎవరు బానిసలు? అనే విషయం తేలుతుందని అన్నారు.
KTR
TRS
KCR
Bandi Sanjay
BJP
Revanth Reddy
Congress

More Telugu News