Budda Venkanna: చంద్రబాబు మా దేవుడు.. ఆయన జోలికి వస్తే తగ్గేదే లే: బుద్ధా వెంకన్న

Buddha Venkanna stated that Chandrababu is their god
  • నిన్న చంద్రబాబు నివాసం ముట్టడి
  • జోగి రమేశ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల దూకుడు
  • టీడీపీ అధినేత నివాసం వద్ద ఉద్రిక్తత
  • మరోసారి తీవ్రంగా స్పందించిన బుద్ధా
  • టీడీపీ నేతల అరెస్ట్ కు కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసాన్ని వైసీపీ శ్రేణులు ముట్టడించిన నేపథ్యంలో, ఇరుపక్షాల మధ్య ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి ఘాటుగా స్పందించారు. విపక్షనేత ఇంటిపై దాడికి అల్లరిమూకను పంపిన సీఎం జగన్ తప్పుడు కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని కుట్ర పన్నుతున్నాడని, అది ఆయనలోని భయానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తమ దేవుడు అని, ఆయన జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లే అంటూ  స్పష్టం చేశారు.

"మాపై దాడి చేసి రివర్స్ లో తప్పుడు కేసులు పెట్టే దుస్థితికి దిగజారిపోయారు. దీన్నిబట్టే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. చంద్రబాబు కోసం ప్రాణాలు ఇవ్వడానికి కార్యకర్తలు, నాయకులం సిద్ధంగా ఉన్నాం" అని బుద్ధా ఉద్ఘాటించారు.

అటు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేయగా, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు వెల్లడించారు.
Budda Venkanna
Chandrababu
God
TDP
YSRCP

More Telugu News