Teja Sajja: ఆసక్తిని రేపుతున్న 'హనుమాన్' వీడియో!

Hanuman First Look released
  • హిట్ టాక్ తెచ్చుకున్న 'జాంబి రెడ్డి'
  • మరోసారి తేజ సజ్జాతో 'హనుమాన్'
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • ఐదు భాషల్లో విడుదల చేసే ఆలోచన  
మొదటి నుంచి కూడా ప్రశాంత్ వర్మ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ఒక జోనర్ కి మరో జోనర్ కి సంబంధం లేని కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తేజ సజ్జా హీరోగా ఈ మధ్య ఆయన చేసిన 'జాంబి రెడ్డి' సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఒక కొత్త ప్రయోగంగా చెప్పుకున్నారు.

ఇక ఆయన తాజా చిత్రంగా 'హనుమాన్' రూపొందుతోంది. ఈ సినిమా కోసం కూడా ఆయన తేజ సజ్జానే కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి, కంటెంట్ ఎలా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి తేజ సజ్జా ఫస్టులుక్ తో పాటు, ఒక వీడియోను కూడా వదిలారు.

తేజ సజ్జా ఇందులో గిరిజన యువకుడి గెటప్ లో కనిపిస్తున్నాడు. ఉండేల్ ధరించి అడవిలో వేటకి దిగినట్టుగా ఉన్నాడు. ఆయన మెడలో సూర్యుడిని పోలిన ఒక లాకెట్ కనిపిస్తోంది. అదే ముద్ర టైటిల్ లోను కనిపిస్తుంది కనుక, ఆయనలోని సూపర్ హీరో పవర్స్ కి ఆ లాకెట్ కారణమని అనుకోవచ్చు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Teja Sajja
Prashanth Varma
Niranjan Reddy

More Telugu News