Samantha: తిరుమల కొండపై జర్నలిస్టు ప్రశ్నకు సీరియస్ అయిన సమంత!...వీడియో ఇదిగో

Samantas reaction to a journalist who asked about rumors
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత
  • మీ గురించి రూమర్లు వస్తున్నాయంటూ ప్రశ్నించబోయిన జర్నలిస్టు
  • ఈ సమయంలో ప్రశ్నించడానికి బుద్ధుందా? అంటూ ఫైర్ అయిన సమంత
సెలబ్రిటీల జీవితాల్లో ప్రతి అంశం కూడా జనాలకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. వారి జీవితాల్లో చోటుచేసుకునే ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా అక్కినేని వారి కోడలు సమంత ఇష్యూ కూడా కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తన భర్త నాగచైతన్య నుంచి ఆమె విడిపోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని గురించి ఇటు సమంత కానీ, అటు నాగచైతన్య కానీ లేదా అక్కినేని ఫ్యామిలీ కానీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు సమంత ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆమె బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది. 'మీ గురించి కొన్ని రూమర్లు వస్తున్నాయి' అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నను అడగబోతుండగా మధ్యలోనే సమంత చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. స్వామి వారి దర్శనం చేసుకుని వస్తున్న ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? బుద్ధి ఉందా? అంటూ ఘాటుగా స్పందించింది.  

మరోవైపు సమంత ఇచ్చిన సమాధానం ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. సామ్ నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నామంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. ఎప్పుడు ఏమి అడగాలనే ఇంగితజ్ఞానం కూడా కొందరికి ఉండదని మండిపడుతున్నారు. ప్రస్తుతం సమంత సీరియస్ గా రియాక్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samantha
Tollywood
Tirumala
Journalist
Reaction

More Telugu News