Prabhas: 'ఆది పురుష్' పోరాట సన్నివేశాల్లో ప్రభాస్!

Adi Purush movie shooting update
  • ఒక వైపున మాస్ యాక్షన్ మూవీగా 'సలార్'
  • మరో వైపున పౌరాణిక చిత్రంగా 'ఆది పురుష్'
  • సీతాదేవి పాత్రలో కృతి సనన్
  • ఆసక్తిని పెంచుతున్న షూటింగు విశేషాలు
ప్రభాస్ ఇప్పుడు ఒక వైపున 'సలార్' .. 'మరో వైపున 'ఆది పురుష్' చేస్తున్నాడు. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలు కావడం .. పూర్తిగా డిఫరెంట్ జోనర్లకు చెందినవి కావడం విశేషం. పక్కా ప్లానింగుతో ఈ రెండు సినిమాల షూటింగుల్లో ప్రభాస్ పాల్గొంటూ ఉండటం మరో విశేషం.

ఇటీవల 'సలార్' సినిమా కోసం ఆయన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొన్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను ప్రశాంత్ నీల్ డిఫరెంట్ గా డిజైన్ చేయించాడు. చిత్రీకరణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు.

ఇక ఇప్పుడు ఆయన 'ఆది పురుష్' సినిమా కోసం చిత్రీకరించే ఒక భారీ పోరాట సన్నివేశంలో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. రాముడు ధర్మాన్ని రక్షించడం కోసం ఎంతోమంది అసురులను సంహరించాడు. ఇప్పుడు చిత్రీకరించే పోరాట సన్నివేశం ఏ సందర్భంలో వచ్చేదనేదే తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో సీతాదేవిగా కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.    
Prabhas
Krithi Sanon
Saif Ali Khan

More Telugu News