డబ్బింగ్ స్టూడియోలో గొంతు సవరించుకున్న ‘బుట్టబొమ్మ’

17-09-2021 Fri 21:28
  • మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ డబ్బింగ్ మొదలుపెట్టిన పూజ హెగ్దే
  • అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం
  • వచ్చే నెల 8న విడుదలకు రంగం సిద్ధం
Pooja Hegde starts dubbing for Most Eligible Bachelor movie

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్దే గొంతు సవరించుకుంది. అయితే ఇదేదో పాట పాడేందుకనుకుంటే పొరపాటే. ఇదంతా అక్కినేని వారసుడు అఖిల్ సరసన ఆమె నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం డబ్బింగ్ కోసమే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర డబ్బింగ్ ప్రారంభమైంది.‘ఎహెం.. (గొంతు సవరించుకొని) ఇక మొదలుపెడదాం’ అంటూ పూజ ఒక ట్వీట్ చేసింది.

మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా ఆశ నెరవేరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘లెహరాయి..’ పాట అభిమానులకు బాగా నచ్చింది. భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ సినిమాలో అఖిల్ ఒక ఎన్నారైగా కనిపిస్తుండగా, పూజ ఒక స్టాండప్ కమెడియన్ పాత్ర చేస్తోంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న పూజ ఈ చిత్రంతో కూడా మంచి సక్సెస్ అందుకుంటుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు అక్టోబరు 8న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.