దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం

17-09-2021 Fri 18:35
  • రోడ్డు ప్రమాదంలో దేవిశ్రీ ప్రసాద్ బాబాయి మృతి
  • విషయం తెలసి గుండెపోటుతో చనిపోయిన మేనత్త
  • సంతాపం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు
Devisri Prasad lost his uncle and aunt

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలే నటుడు ఉత్తేజ్ భార్య క్యాన్సర్ కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే మేనత్త సీతామహాలక్ష్మి గుండెపోటుతో మృతి చెందారు. గంటల వ్యవధిలోనే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడంలో డీఎస్పీ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.