Tanish: డ్రగ్స్ కేసులో నటుడు తనీష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ

ED questions actor Tanish
  • టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ
  • మనీలాండరింగ్ కోణంలో విచారణ
  • నేడు ఈడీ ఎదుట హాజరైన తనీష్
  • తనీష్ ను 7 గంటలపాటు విచారించిన అధికారులు
టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ జరుపుతుండడం తెలిసిందే. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ ప్రముఖులను వరుసగా విచారిస్తున్న ఈడీ అధికారులు నేడు నటుడు తనీష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై తనీష్ ను 7 గంటల పాటు విచారించారు.

డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో పరిచయాలపైనా, ఎఫ్ క్లబ్ లో జరిగే ప్రత్యేక పార్టీల గురించి తనీష్ ను అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటిదాకా పూరీ జగన్నాథ్,  రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, నవదీప్, రానా, ముమైత్ ఖాన్ తదితరులను ప్రశ్నించింది.
Tanish
ED
Moneu Landerting
Drugs Case
Tollywood

More Telugu News