మళ్లీ మొదలైన 'ఎఫ్ 3' షూటింగ్!

  • గతంలో హిట్ కొట్టిన 'ఎఫ్ 2'
  • సీక్వెల్ గా రూపొందుతున్న 'ఎఫ్ 3'
  • నాన్ స్టాప్ గా జరగనున్న షూటింగు
  • ప్రత్యేక పాత్రలో సునీల్.. సంక్రాంతికి విడుదల  
F3 movie shooting update

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన 'ఎఫ్ 2' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ చేసిన సందడి ఆడియన్స్ ను విపరీతంగా అలరించింది.

దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చేయాలని అనిల్ రావిపూడి - దిల్ రాజు రంగంలోకి దిగారు. కొంతవరకూ షూటింగ్ జరిపిన తరువాత కరోనా కారణంగా ఆపేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మళ్లీ సెట్స్ పైకి వెళ్లారు. అక్కడ సందడి చేస్తున్నప్పటి ఫొటోను వదిలారు.

తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టారు. ఈ సినిమాను 'సంక్రాంతి' కానుకగా విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు. అందువలన ఇక నాన్ స్టాప్ గా షూటింగు జరపనున్నారని తెలుస్తోంది. ఈ సారి సునీల్ కొత్తగా యాడ్ అయిన సంగతి తెలిసిందే.

More Telugu News