'మా' ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. నియమ నిబంధనలు ఇవే!

17-09-2021 Fri 17:28
  • అక్టోబర్ 10న పోలింగ్
  • ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన
MAA elections notification released

తెలుగు సినీ పరిశ్రమలో కాక పుట్టిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10న (ఆదివారం) పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ చెప్పారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్లు, 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ల ఎన్నిక కోసం ఎలెక్షన్ ను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ ఎన్నికకు ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. వచ్చే నెల 2వ తేది సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 2వ తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. పోలింగ్ జరిగే అక్టోబర్ 10న సాయంత్రం 7 గంటలకు ఎన్నికల ఫలితాలను  వెల్లడిస్తారు.

'మా' ఎన్నికల నియమ నిబంధనలు:

  • ఒక అభ్యర్థి ఒక పదవి కోసం మాత్రమే పోటీ చేయాలి.
  • గత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అయి ఉంది... 50 శాతం కన్నా తక్కువ ఈసీ సమావేశాలకు హాజరు కాకపోతే పోటీ చేయడానికి అర్హత ఉండదు. 
  • 20 శాఖల అసోసియేషన్లలో ఆఫీస్ బేరర్స్ గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయాలి. లేకపోతే వారు పోటీ చేసేందుకు వారు అర్హులు కారు.